Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MULA VEERESWARA RAO

Classics Inspirational Children

4  

MULA VEERESWARA RAO

Classics Inspirational Children

త్యాగ ధనుడు -నాన్న

త్యాగ ధనుడు -నాన్న

1 min
382


త్యాగ ధనుడు -నాన్న


నీకు గొడుగు ఇచ్చి

తను వర్షం లో అడుగు

లు వేసాడు !


నీవు తూనీగ ల తో

ఆడుతుంటే

నీ స్కూలు బ్యాగ్ లు

మోసాడు !


నీ కొత్త సైకిల్ కోసం

తన పాత స్కూ టర్

పాత సామాను గా మారి పోయింది !


ప్రియమైన పి ఎఫ్

నీ ఉద్యోగానికి కరిగి పోయింది !


నీవు రైలు లో ఉన్నత శ్రేణి లో

ప్రయాణం చేస్తే

తను సాధారణ తరగతి కి

పరిమిత మయ్యాడు


తన ధనం నీ జీవితాని కి

ఇంధనమయింది !


తన తనువు

నీ జీవన సమరానికి

ధనువయింది


ప్రేమ లో అక్షరాలు

రెండు

నాన్న ప్రేమ లో

లక్షణాలు

మెండు !



Rate this content
Log in

Similar telugu poem from Classics