తెలుగు నుడి
తెలుగు నుడి
వినిపించాలి తెనుగు నాడు లో తెలుగు నుడి,
ఎంతో అపురూపమైనది ప్రతి తెలుగు నానుడి,
నాడు నేడు కీర్తి చెందింది తెలుగు పలుకుబడి,
అన్నమయ్య సంకీర్తనలతో సవ్వడి సందడి పొందుతోంది తిరమలేశుని గుడి ।౧।
తెలుగును కాపాడాలి తెలుగులో ఆడీపాడి,
తెలుగు బడిలో ఉజ్జీవించేను తెలుగు నాడి,
కావ్యాలు పెంచాయి అమ్మవాక్కుల నడవడి,
మురిపించే పల్లెపదాలు తేనే కురిపించే పలుకులు మరిపించెను మిఠాయి అంగడి |౨|
వ్యవహార భాషగా చెయ్యాలి తెలుంగును వాడి వాడి,
తెలుగు పదాలు పద్యాలు చేస్తాయి గమ్మత్తు గారడి,
మాతృక పసిడి వాక్కులు ఎప్పుడూ ఉండెను వెంబడి,
ఆంధ్రుల ఆత్మగౌరవంగా తళతళలాడుతుండాలి ఈ నిత్యనూతన ప్రాచీన పుత్తడి |౩|