మంచి మాట
మంచి మాట
పద్యం:
ఎండ మావి లోన యేటి నీళ్ళేలరా
ఇప్ప నూనె యేల ఇసుక లోన
మంకు బోతు నోట మంచిమాటేలరా
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! ఎండమావి లోన సెలయేటి నీరు ఎలా దొరుకుతాయి? ఇసుక లోన ఇప్పనూనె ఎలా దొరుకుతుంది? అలాగే మూర్ఖుడి నోటి నుండి మంచి మాటలు ఎలా వస్తాయి?