పుస్తకం
పుస్తకం


పద్యం:
నీరు తీర్చు నీకు నిండైన దాహము
కూడు తీర్చు నీకు కొంత గొద ను
మంచి పుస్తకంబు మార్చు నీ బతుకును
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! నీరు మనకు కల్గిన దాహాన్ని తీరుస్తుంది. ఆహారం మనకు కల్గిన ఆకలిని తీరుస్తుంది. కానీ ఒక మంచి పుస్తకం చదివితే మాత్రం మన జీవితాన్నే మార్చేస్తుంది.