విశ్వకవి జాషువా
విశ్వకవి జాషువా
చతుర్వర్ణ విధానాన్ని
తూర్పారబెట్టి
వర్ణ వ్యవస్థలో లోపాలను
లోకానికి కళ్ళకు కట్టినట్లు
చూపించి కుల వ్యవస్థ కుళ్ళును
కడిగి ఆరేసిన అభ్యుదయ కవి
తరాలెన్ని మారినా
కులాల భవంతుల పద్దతులు
కూలవు... పెరిగిపోతూనే ఉన్నాయి
నవ వేకువలు ఎన్ని వచ్చినా
పెడ పిడి వాదనలు మారలేదు
అయినా దళిత జన అభ్యుదయమై
నిచ్చెన మార్క్ కుల కుంపటిని
అర్పడానికి తన అక్షర జలాన్ని
కుమ్మరించి మనకవికుల లక్ష్యాన్ని
నిర్దేశించి ప్రజాకవి అయ్యాడు
గబ్బిలం... ఫిరదౌసి
వంటి మేటి కావ్యమాలలను
లోకం మెడలో వేసి
నవ యుగ కవి చక్రవర్తి అయ్యాడు
పద్మభూషణ్ బిరుదును పొందాడు
పంచభూతాలూ పాటించని
పంచముడు వర్ణ వ్యవస్థ
మనకెందుకని సాంప్రదాయవాదులను
ప్రశ్నించి...పేదల పక్షపాతి అయ్యాడు
కవిరాజు... విశ్వకవి
విశ్వనరుడు... అభ్యుదయకవి
జాషువాది తెలుగు సాహితీ వెలుగులో
దళిత సాహిత్య కాంతిలో
తరగని కాంతి క్రాంతి!!!
.