అనుబంధాలు
అనుబంధాలు
ఈ చిన్న జీవితంలో అందరం చూస్తాం ఎన్నో బంధాలు,
కొన్ని సంబంధాలు అయ్యెను అనువైన అనుబంధాలు |౧|
ప్రతి ప్రాణికి తన తల్లి అయ్యెను తియ్యటి బంధం,
అమ్మ ప్రేమ ఎప్పుడు ఒక అనంతమైన నిబంధం |౨|
గురుశిష్యుల మధ్య ఉండెను చదువుల బంధం,
శిష్యులు విద్యాబలం చూసి గురువులు పొందేరు ఆనందం |3|
తండ్రి పిల్లల బంధం ఎప్పడూ అపురూపం,
తన స్వార్థత్యాగంతో తీర్చిదిద్దెను పిల్లల జీవం స్వరూపం |౪|
ఎంతో ముఖ్యమైనది స్నేహబంధం,
ఎంతో ముఖ్యమైనది భార్యాభర్తల అనుబంధం |౫|
శ్రీవెంకన్నస్వామితో ఎప్పుడు ఉండాలి భక్తిరస అనురక్తి అనుభవం,
పూరి శ్రీ జగన్నాథ స్వామితో ఎప్పడు ఉండాలి ఆత్మసమర్పణ అనురాగం |౬|