ప్రవర్తనం
ప్రవర్తనం
సతతం సంతులితంగా ఉండాలి మనిషి మనిషిలో ప్రవర్తనం,
ఆలోచన సమాలోచనలతో వ్యవహారంలో వచ్చెను పరివర్తనం,
భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడెను మనిషి సైద్ధాంతిక వర్తమానం,
దుర్భాషని సరిదిద్దుకోవటానికి మనిషి చేయలేడు ప్రత్యావర్తనం |౧|
వాక్సరణి ప్రవాహంలో అపరిహార్యంగా ఉండాలి నియంత్రణం,
సంతులితంగా సమస్వరంగా ఉండాలి పరస్పర సంభాషణం,
అవాంఛిత వ్యత్యాసాలు కేవలం సృష్టించెను ఆయాసకర రణం,
దుర్వచనాలు ఇచ్చెను అపరివర్తనీయ విద్వేషానికి నిమంత్రణం ।౨ |