*శ్రావణమాసపు బంధువులు*
*శ్రావణమాసపు బంధువులు*


మాసాల్లో ప్రత్యేకమైన మాసం,
పవిత్రమైనది శ్రావణమాసం ,
సకల దేవతలకు ప్రీతికరమైన శ్రావణ మాసం,
ఎన్నో పండగలను తీసుకొచ్చే శ్రావణమాసం,
స్త్రీలందరికి ఎంతో ఇష్టమైనది శ్రావణమాసం ,
సౌభాగ్యం తీసుకొచ్చే శ్రావణమాసం,
శ్రావణమాసంలో లక్ష్మీ పూజలు, అందరికీ ఉండాలి లక్ష్మి ఆశీస్సులు, ఇంటింటా చేరిన సిరిసంపదలు, ఇంటిల్లపాది సందడి,
చాలా హడావిడి,
శ్రావణమాసంలో దీపావళి ,
చీకట్లో నుంచి వెలుగులోకి తెచ్చే దీపావళి,
సంతోషపు కేళి,
చెడు పై మంచి విజయకేతనం దీపావళి,
శ్రావణమాసంలో వచ్చే బోనాలు, అమ్మవారిని పూజించే హిందువులు, పసుపు కుంకుమలతో పూజలు, తీసుకొచ్చే కొత్త కాంతులు ,
మరువలేని జ్ఞాపకాలు,
ఇవే మా శ్రావణమాస శుభ దినాలు.