*యశోదారెడ్డి*
*యశోదారెడ్డి*
అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితం ఆరంభం,
ఆమెది ఆదర్శ స్వభావం,
పుట్టింది బిజినేపల్లి,
ఆమె అక్షర జాబిల్లి,
హిందీ, ఉర్దూ, కన్నడ ,జర్మన్, భాషలో మంచి పట్టు సాధించింది,
ఆకాశవాణి తెలంగాణ మాండలిక లో తొలి రచయిత గా పేరు పొందింది,
యశోదారెడ్డి ప్రముఖ రచయిత్రి గా, ప్రముఖ కవియిత్రిగా,
ఒక విమర్శకురాలిగా,
పరిశోధకురాలు గా,
పేరు సంపాదించుకుంది,
యశోద రెడ్డి రాసిన కథలు,
ఎచ్చమ్మ ,మా ఊరి ముచ్చట్లు, తెచ్చిపెట్టాయి చాలా ప్రాముఖ్యతలు.
ఆవిడ రాసిన కథలలో,
జీవితాన్ని చూపిస్తాయి,
జీవిత రహస్యాలు వివరిస్తాయి, తీయటి అనుభూతిని మిగులుస్తాయి,
చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తుస్తాయి.