STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Inspirational Children

4  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

నేటి తెలంగాణ.

నేటి తెలంగాణ.

1 min
421


ఎంతమంది త్యాగమూర్తుల ఫలితం,

మన తెలంగాణం,

నవ తెలంగాణగా అవతరించి,

ప్రజల గుండెల్లో ఆశలు చిగురించి,

కష్టాలన్నీ కనుమరుగయ్యి,

ఎంతోమందికి ఆసరాగా నిలిచి,

పథకాల ఎన్నో ప్రారంభించి,

యువతకు ఉద్యోగాలు కల్పించి,

రైతన్న కళ్ళల్లో వెలుగును నింపి,

రైతుబంధుతో అండగా నిలిచి,

కంటి వెలుగుతో కంటి చూపును అందించి,

తెలంగాణ అందాలను చూపించి,

మిషన్ భగీరథ తో ఎంతోమంది గొంతును తడిపి,

ప్రజల కన్నీటిని తుడిచి,

కళ్యాణ లక్ష్మి తో ఎంతోమందికి పెళ్లిళ్లను చేసి,

24 గంటలు విద్యుత్ సరఫరా అందించి,

షీ టీమ్ లతో ఆడపిల్లలకు తోడు నీడై నిలిచి,

అమ్మ ఒడి తో కొండంత ధైర్యాన్నిచ్చి,

డబల్ బెడ్రూమ్ లతో పేదలకు ఆశ్రయం కల్పించి,

పచ్చని తోరణాలతో హరితహారం,

ఈ అభివృద్ధి పట్టణం,

నేటి తెలంగాణ ప్రజా జీవనం,

ఎంతో మందికి ఆదర్శం.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Abstract