ప్రేమ వృక్షం (prompt 8)
ప్రేమ వృక్షం (prompt 8)


ఆహ్లాదకరమైన ప్రకృతికి ప్రతీక పచ్చదనం
మనిషి జీవనానికి కావలసిన ముఖ్య ఇంధనం
నేడు పచ్చదనాన్ని కాటు వేస్తోంది కాలుష్యం
కర్మాగారాల వలన పర్యావరణం ఔతోంది కలుషితం
జనారణ్యం పెంచుతూ ఆక్రమిస్తున్నాం వనారణ్యం
చెట్లు, చేమలు కోల్పోతున్నాయి సహజమైన పచ్చదనం
ప్రకృతి వలె సహజత్వాన్ని కోల్పోతోంది బాంధవ్యం
మసి బారి పోయింది ప్రేమానురాగాల వృక్షం సహితం