STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Abstract

5.0  

Venkata Rama Seshu Nandagiri

Abstract

ఓ మహిళా! వందనం!!

ఓ మహిళా! వందనం!!

1 min
411

మేల్కొందువు ఓ మహిళా! ఉషోదయాత్పూర్వమే నీవు,

ఆనాటి భవిష్యత్ కార్యాచరణము మొదలిడుదువు

నీవే కదా, కాఫీ, పాలు, తేనీరు వంటి కోర్కెలు తీర్చెదవు,

అడగకముందే ఆకలని అందరి కడుపులు నింపే అన్నపూర్ణమ్మవు

నీవే చదువు చెప్పి బిడ్డల సందేహములు తీర్చే గురువు

అతిథి, అభ్యాగతులను గృహణిగా, ఆప్యాయతతో ఆదరింతువు

బిడ్డా యని తల్లిదండ్రులు, చెల్లీ యని అక్క, అన్నలు

అక్కా యని చెల్లీ తమ్ములు, కోడలా యని అత్తమామలు,

భార్యామణీ యని భర్తగారు, వదినా యని మరుదులు

అమ్మా , అత్తమ్మా యని నోరారగా పిలుచు బిడ్డలు

అమ్మమ్మా‌ , నానమ్మా యను మనుమల ముద్దు పిలుపులు

నీ ఒకతె వైనను, నీకెన్ని తిరుగులేని పిలుపులు

అందరినీ పలుకరించు ఒకేసారిగా నీ చిరునవ్వులు

అంతటికీ మూలమైనవి నీ మృదుమధుర భాషణములు

నీ చిత్తము శాంతము, సహనము, మృదు, మధుర భావములకు నెలవు

ఓ మహిళా! నీఒకతెవే యైనను యెన్న విధముల

భాసింతువు!

ఓ స్త్రీ మూర్తీ! అందుకొను'మా' శతకోటి ప్రణామములు. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract