విమానంలో ..!
విమానంలో ..!
విమానంలో ప్రయాణమంటే ఎవరు కళ్ళెగరేయరు !
సమయానికి తీసుకెళ్తే చాలనే వారేనా అందరూ ?
క్లిక్ చేయగానే ఆన్లైన్ టికెట్ దొరికితే అది అదృష్టం .
కన్ఫర్మేషన్ కోసం ఎవరైనా సహకరిస్తే ఎంతో హర్షం .
విమానాశ్రయంలో స్వాగతం పలికితే కడు ఉల్లాసం .
మనకు నచ్చిన సీట్ కేటాయిస్తే చెప్పలేని సంతోషం .
లగేజ్ అందుకుంటే నిజంగా హయినిచ్చే అనుభవం .
ఫ్లైట్ ప్రవేశానికి మార్గం సుగమం చేస్తే అమితానందం .
రవాణాలో భద్రతా సూచనలూ ఎప్పుడూ అవసరం .
నీరు , తేనీరు , ఆహారం తప్పకుండా మనం కోరుతాం .
సుఖంగా గమ్యాన్ని చేరడంలోని సేవలు కాదా ప్రత్యేకం !
వాటిని అందించేవారి నైపుణ్యం అభినందనీయం !!
*** *** ***