కవిత్వం
కవిత్వం
మనసును కదిలించేది కవిత్వం...
మనసుకు కదలికలు నేర్పేది భావోద్వేగం...
మనసులో కదిలిన భావం, మనసుకు కదలికలు నేర్పిన భావోద్వేగం కవిత్వం...
కల్ల ముందు కనిపించనివి కనుల ముందు కలంతో సాక్షాత్కారింపచేసేది కవిత్వం...
కలగన్నది, కల్లలయ్యేది, మనసు పొరల్లో దాగుడుమూతలు ఆడేది కవిత్వం...
"కవిత్వం" మనసు అంతర్భాగంలో దాగిన ఆలోచనలను కలంలో నింపుకుని వెలుగు చూపే అక్షర నక్షత్రాల సమూహం...
