చీకటి వేదన
చీకటి వేదన
అంశం: నలుపు..
నల్లని "నలుపు" తెరల్లో నిద్ర పోతున్న చీకటి
నా విరహ వేదనను మరింత పెంచుతుంది..
తన జ్ఞాపకాలు నన్ను చుట్టు ముట్టగానే నల్లని కారు మేఘాలు
నా మనసును అలుముకున్నాయి..
నా ఆవేదనా తరంగాలలో చీకటి చిక్కబడిపోయి నా విరహవేదనతో పోటీ పడుతుంది..
కమ్ముకున్న చీకటి మనసుకా!
నల్లని రాత్రికా తెలియట్లేదు..
నాకిష్టం లేని నలుపు జీవితమంతా నీకు నేనే తోడు అంటూ నన్ను చీకటిలో ఉంచేసింది..
చీకటి ఏమో కాళరాత్రిలా
నా మనసును ముంచేసింది..
