STORYMIRROR

T. s.

Abstract Others

4  

T. s.

Abstract Others

విశ్రాంతి

విశ్రాంతి

1 min
66

కావాలి ఒక విశ్రాంతి..

కల్లలయిన కలలకు..

కన్నీటితో కాపు కాసే కనులకు కావాలి ఒక మలయ మారుతం..

కావాలి ఒక విశ్రాంతి..

కదలనన్న కలానికి..

కలల విహరంలో ఓడిపోయిన ఊహలకు కావాలి ఒక ఓదార్పు సమీరం.. 

కావాలి ఒక విశ్రాంతి..

కలలు కనలేని మదికి..

కాలిపోయిన మనసుకు కావాలి హిమ కుసుమ పవనం..

కావాలి ఒక విశ్రాంతి..

చెదిరిన భావాలకు..

చెంత లేని నిద్రకు కావాలి ఒక సేద తీర్చే చల్లని తీరం..

కావాలి ఒక విశ్రాంతి..

బ్రతుకు సమరంలో అలిసిపోయిన కాయానికి కావాలి విశ్రాంతి..

అది చిట్ట చివర చితిలో తీసుకునే విశ్రాంతి.. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract