STORYMIRROR

T. s.

Abstract Fantasy Thriller

3  

T. s.

Abstract Fantasy Thriller

బ్రతుకు రంగులు

బ్రతుకు రంగులు

1 min
7

అంశం: బ్రతుకు రంగులు..


జీవితం రంగుల ప్రపంచం

జీవితంలోఎరుపు లాంటి ఆవేశం ఉంది.

రుధిర వర్ణపు ఆవేదన ఉంది.

పసుపు పచ్చని పవిత్రత ఉంది.

ఆకుపచ్చని ఆనందం ఉంది.

వంగపండు ఘుమ ఘుమల గుబాళింపు ఉంది .

తెల్లని స్వచ్చమైన ప్రశాంతత ఉంది.

లేత గులాబీల పరవశం ఉంది.

నలుపు లాంటి విషాదం ఉంది.

నీలాల కన్నుల్లో భక్తి ఉంది.

నీలాకాశం శక్తి ఉంది.

నారింజ పొద్దు ఉంది నయనానందకర సద్దు ఉంది.

వేకువ కిరణాలతో సయ్యంటూ సాయంసంధ్య ఉంది.

వెన్నెల మెరుపులతో పోటిగా నక్షత్రాల జిలుగు ఉంది.

బ్రతుకు రాజ్యానికి రంగుల రాశి ఉంది.

బ్రతుకు చిత్రం గీయడానికి ఆకాశం కుంచె ఉంది.

రంగు రంగుల ప్రపంచం రాస్తున్న రాత చెపుతుంది.

జీవితం రంగుల ప్రపంచం అని చాటి చెపుతుంది.


Rate this content
Log in

Similar telugu poem from Abstract