రంగులు జీవితం
రంగులు జీవితం
ప్రేమ రంగులు జీవితానికి వెలుగులు
బ్రతుకు చమక్కులు బంధాలు అనుబంధాలు
మైమరపు రంగులు ఆప్యాయత అనురాగాలు
ఆశల చిత్రాలు ముంగిట్లో రంగవల్లులు
ఆడపిల్ల నవ్వులు అల్లరి అరవిందాలు
సప్త వర్ణాల సౌందర్యాలు హరివిల్లు సొగసులు
తారల నగవులు ఆకాశాన అలికిన రంగులు
వెన్నెల మెరుపులు వెలిగే దివ్వెలు
విరహపు రంగులు సరసాల సొబగులు
వేదనలో వేడుకలు విషాదాల రంగులు
వెచ్చని రంగులు సూర్యోదయపు కాంతులు
సంధ్యా కాంతులు ముగిసిన జీవితానికి శాంతి, విశ్రాంతి రంగులు
రంగు రంగుల భావోద్వేగాలు అక్షరాల మాలలు
అవని అంతా విరియాలి ఆనందపు జిలుగులు
రంగు రంగుల రంగేళి రంగులతో రాస్తున్న జావళి..
