వేకువ సంధ్య
వేకువ సంధ్య
అంశం: నారింజ రంగు (ఆరెంజ్)..
పొద్దుగూకే వేళ సంధ్య వాలింది.
ఆకాశంలో సూర్యుడు నారింజ కెంజాయ రంగుతో ప్రకాశిస్తున్నాడు.
పక్షులు హడావిడిగా తమ గూటికి పయనిస్తున్నాయి నిశి రాతిరి రాక ముందే తమ నివాసాన్ని చేరాలని.
అలసిన సూర్యుడుతో పాటు..
పిల్లలు, పెద్దలు తమ విధులను నిర్వర్తించి అలిసిపోయి సేద తీరడానికి విశ్రాంతి తీసుకుంటున్నారు.
కొత్త ఉదయం కోసం, నూతన ఉత్సాహాంతో మళ్లీ వేకువ కిరణాలు తమని లేపే వరకు..
నారింజ రంగు పులుముకున్న సూర్యుడు మేల్కొనే వరకు..
