మనసు పుస్తకం
మనసు పుస్తకం
అంశం: తెలుపు..
తెల్లని నా మనసు పుస్తకంలో ఎన్నెన్నో వర్ణాలు.
అన్నీ రంగు రంగుల భావ చిత్రాలు.
తెలుపు ఉంటేనే కదా రంగులు అద్దడం కుదిరేది
వర్ణాల మిశ్రమం తెలిసేది.
తెల్లని తెలుపు లాంటి నా మనసుకు పట్టింది రంగుల తెగులు. గుండెల్లో గుబులు.
విషాదమొక రంగైతే, విరహమొక రంగైంది.
సంతోషమొక రంగంటే సరదాల రంగంది.
ప్రేమ ఒక రంగంది, గెలుపు ఓటములొకటేగా అంది.
ఇన్ని రంగులు తెల్లని తెలుపు లాంటి నా మనసును ఆక్రమించుకున్నాయి.
కలం కుంచెతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.
స్వచ్చమైన తెలుపు మాత్రమే కావాలనుకునే నా మనసు శాంతిని కోల్పోయింది.
అశాంతిలో మునిగిపోయింది.
తెల్లని తెలుపు మసకబారి పోయింది.
