జ్ఞాపకాల కాలం
జ్ఞాపకాల కాలం
కాలం వేగంగా కదిలిపోతుంది.
ఈ మనసు జ్ఞాపకాలతో మండిపోతోంది.
చీకటిలో కలిసిపోయిన రాత్రి వేదనతో నిట్టూర్పు విడుస్తుంది.
కాలిపోయే మనసుకు కదిలిపోయే కాలానికి వారధిగా జ్ఞాపకాల జాతర జరుగుతుంది.
జగమేమో నిద్ర పోతున్న జనాన్ని వదిలేసి మేలుకుని ఉన్న నన్ను వేదిస్తుంది.
ఝాము రాతిరి దాకా నిద్ర జాడ లేక రాత్రి కాలం వెనుక పరుగులు తీస్తుంది.
మనసు జ్ఞాపకాల తోవలో మధుర స్వప్నాల మంటల్లో కాలిపోతుంది. ఆ చీకటిలో అంతమయ్యే రాతిరిలా..
