అయ్యా ఓ శివయ్యా
అయ్యా ఓ శివయ్యా

1 min

182
అయ్యా ఓ శివయ్యా ఎక్కడ ఉన్నావయ్యా
బువ్వ తినమంటె అలక ఎందుకయ్యా
పచ్చి మామసానికె కన్నప్పని కరుణించావయ్యా
పాయసం తినమంటె మౌనం ఎమయ్యా
రామయ్య అన్నం వద్దంటే
చంద్రుడ్ని చూపించింది ఆ తల్లి
నా తండ్రికి చంద్రుడె ఆభరణమె
నిన్ను ఎలా బుజ్జగించేది అయ్యా
శ్మశానాన దాగితే రాననుకున్నావా
హిమలయాలు దూరం అనుకున్నావా
ఎక్కడ ఉన్నా ఒక ముద్ద అయినా తినెవరకు వదలనయ్యా
ఆ ప్రమదులకు మాత్రం ఒక మాట చెప్పిపెట్టు దూరంగా ఉండమని
భయం అనుకుంటా ఎమొ అయ్యా
నా తండ్రికి దిష్టి తగల కుడాదని ఓ అయ్యా
అయ్యా ఓ శివయ్యా ఎక్కడ ఉన్నావయ్యా