Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Drama

4.9  

Ramesh Babu Kommineni

Drama

స్మృతులు

స్మృతులు

1 min
713


ప౹౹

అందుకున్నాలే ఆ వేళ అందమైన సందేశం

పొందికగ పొదిగి నిండుగ కోరిన సహవాసం ౹2౹


ప౹౹

ముత్యాలనూ మురిపించే ముచ్ఛటక్షరాలు

వ్యత్యాసాలనే తొలగించే చక్కటి లక్షణాలు ౹2౹

లేఖలో ఆవిష్కరించీ అభిమానించిన క్షణం

లోకంలో తొలిగా రేగే నాలో హృదయరణం ౹ప౹


చ౹౹

కొండ అద్దమందునా కొంచెమై ఉండునట్ట్లూ

గుండెలో పేరిమి అక్షరాలలో ఇమిడీనట్ట్లూ ౹2౹

మరింత మరులు పెరుగ మదిచేసే తమాష

ఎంత బాగా రాశావో ఎదలోని ఆ పదఘోష ౹ప౹


చ౹౹

నిత్యం ఆ లేఖ పఠనం ఓ ముఖ్య వ్యాపకం

సత్యమే చెపుతున్నా మరువని ఆ జ్జాపకం ౹2౹

స్మృతులుగా మిగిలే సుతిమెత్తని భావాలు

రాతలుగా మారే ఒకనాటి ఆ అనుభవాలు ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Drama