కరోనాతో కాలం...
కరోనాతో కాలం...


కర్కశంగా కరిగిపోతుంది....
కలలన్నీ చెదరగొట్టి....
కన్న పేగుబందాలను దూరం చేస్తూ...
కరోనా అన్న ముసుగు దొంగలా....
మారువేషంలో వచ్చి మనుషుల్ని మట్టి కరిపించి... మానవత్వం మచ్చుకైనా చూడనివ్వక....
నిర్దాక్షిణ్యంగా మన్నులో ముంచి కాలం కరిపోతుంది...
రేపటి రోజుకు రోదనలను మిగిల్చి...
భావితరాలకు మాయని మచ్చలా మారి....
భూగోలానంతటిని భయపెడుతూ...
బతుకువేటకై పరాయి దేశంలో చిక్కిన జనాలకు....
బహుబంధాలను దూరం చేస్తూ..
భయానకాన్ని సృష్టించి బెదురేలేక.....
కాలం కరిగిపోతుంది....
వంద ఏళ్ల చరిత్ర ను తిరగరాసి..రక్కసి రోగాల రొంపలో పడేసి....
దిక్కులు బిక్కటిల్లేలా బిగ్గరగా నవ్వుతూ.....
కాలం కరిగిపోతుంది..
ఇలాంటి అల్లకల్లోలాలకు అంతమెప్పుడు...
ఈ సృష్టి అంతమైనప్పుడా.....!!
రచన
-కావ్యరాము