జీవిత ప్రయాణం
జీవిత ప్రయాణం
అంచుల్లేని అవని!
నెరవేరని కోరికలు!!
అంతుల్లేని ఆకాశం!
దరిచేరని జ్ఞాపకాలు!!
అలుపుల్లేని అలలు!
సేదతీరని శరీరం!!
వెలుగు లేని ప్రాంతంలో నన్ను నేను వెతికేదెలా!!
గమ్యం ఎరుగని దారిలో నన్ను నేనే చేరేదెలా!!
కనులకు తెలియని కన్నీటి ప్రవాహాన్ని ప్రతిగటిస్తూ ఒడ్డుకు చేరేదెలా!!
పెదవులకి తెలిసిన చి
రునవ్వుని బందిస్తూ బిగ్గరగా అరిచేదెలా!!
ప్రతి కథకు అంతము ఉండనెలా!!
ప్రతి జన్మకి ముగింపు పలకనెలా!!
కనులకు అగుపడని ఓ సృష్టికర్త..!
ఏమి నీ లీలా?
తారసపడే వాటిని దరిచేరనివ్వవు ...!!
ఏమిటో ఈ మాయా??