"నాలో నేను..!"
"నాలో నేను..!"
నాలో నేను...!
అందరిలాగే సముద్రం లాంటి ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన నువ్వు, మొదట నీ ముందున్న పిల్ల కాలవనే సమాజాన్ని ఈదాలనే సంగతే మరిచేపోయావా ?
ఎంతసేపూ...
నీతోటోడు ఎంచక్కా జాబ్ చేస్తున్నాడు...
నువ్వు మాత్రం ఇంకా ఖాళీగానే ఉన్నావా ?
అంటూ ఇంట్లో వాళ్ళు
నీకంటే చిన్నోడు అప్పుడే పెళ్ళిచేసుకున్నాడు ...
మరి నీ పెళ్లెప్పుడు.. ఇంకా చేసుకోవా ?
అంటూ ఇరుగుపొరుగు వాళ్ళు
మన చుట్టాలబ్బాయి జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు...
నువ్వు మాత్రం ఇక్కడే చతికలబడ్డావ్
అంటూ బంధువులు
బయట వాళ్ళతో పోల్చి పదే పదే దెప్పిపొడుస్తూ...
అసలు నీకున్న నైపుణ్యం ఏమిటో గుర్తించక
నీ గమ్యపు దారిని రాబంధువుల్లా పక్కదారి పట్టిస్తుంటే,
వాటికి కృంగిపోయిన నీ వ్యక్తిగత ఆలోచనలు,
ఆశయాలు ఎప్పుడో హరించుకుపోయయా...?
ఎంత ఆలస్యమైనా అనుకున్నది సాధించాలనే నీకున్న సంకల్పం, పట్టుదల, శ్రమ నీ దారిలో అడ్డంకులను జయించుకుంటూ వెళ్ళినా...
వాస్తవానికి వాటితో పాటు కాసింత తలరాత కూడా ఉండాలన్న విషయం తెలిసే సరికి పరిస్థితులు చేజారిపోయాయా ?
ఆశయంతో ఆకాశానికి నిచ్చెన వేసినా ..
అనువంతైనా అదృష్టం లేని నీ బ్రతుక్కి
ఆ ఆశలపై ఆసక్తనేది కరిగిపోయిందా?
ఎంతలా అంటే,
దొరకని వాటి కై వెతుకుతూ పరితపించేంతగా...
అందని వాటి కై ఆలోచిస్తూ ఆదమరిచేంతగా..
నీలో నిన్నే నువ్వు మార్చిపోయేంతగా...
నీకు నిన్నే సరికొత్తగా పరిచయం చేసుకునేంతగా ...
అనవసరమైన వాటి వెంటపడుతూ
p>
సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమోనన్న ప్రతిసారి ..
"ప్రయత్నిస్తే పోయేదెం ఉందిలే !" అన్న మరో ఆశ నీలో చిగురిస్తున్నా...
అవకాశాలు కరువై, అద్భుతాలు కనుమరుగై నీ గమ్యానికి నిన్ను దూరం చేసాయా ?
ముక్కుమొహం తెలియని వాళ్ల గురించి కూడా పరితపించే నీ హ్రుదయం ...
నీ ఈ క్లిష్ట పరిస్థితిలో అయినవాళ్లే దూరం పెడితే తట్టుకోలేనంతగా దిగజారిపోయిందా ?
"ఈరోజుల్లో సాయం చేసిన వాడు మోసపోతున్నాడు.
మోసం చేసిన వాడు బాగుపడుతున్నాడు." అని ఎవరో అన్నట్టు మంచికే కాదు నిజానికి బంధాలకు, విలువలకు కూడా నిజంగానే విలువ లేని రోజులివని ఇకనైనా గుర్తించావా ?
కొన్ని బాధ్యతల నడుమ నలిగిపోయిన నువ్వు,
గతంలో కూరుకుపోయిన నీ ఆలోచనలు...
ప్రస్తుతం అనే ఈ పద్మ వ్యూహాన్ని చేధించలేక చతికిల పడ్డాయా !
అందుకేనేమో, భవిష్యత్తు గురించి ఆలోచించే ఓపిక నీలో కరిగిపోయిందా ?
కొన్నేళ్ల కిందట ప్రతి చిన్న విషయానికి వర్షపు ధారలా కన్నీటి చుక్కలు రాల్చిన నీ కనులు..
ఇప్పుడు ఎంతటి పెద్ద కష్టంలోనైన ఎడారిలో దొరకని నీటి చెమ్మను తలపిస్తున్నాయా...
అంతలా పాఠాలు నేర్పించాయా నువ్వు నేర్చుకున్న ఈ అనుభావాలు ?
కృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న నువ్వు...
ఎడారిలో ఎండమావిని వెతుకుతూ ఇంకా అక్కడే ఆగిపోతే ఎలా ?
గెలుపు ముంగిట ఎన్ని సార్లు బోల్తా కొట్టి బొక్క బోర్లా పడ్డా...
నీ ఈ జీవితంలో విజయం అనే అంచును చేరటం కోసం
ఆగిపోక ఆరాట పడుతూ నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉండగలవా... ?
నిలవగలవా...?
ఎదగగలవా...?
-mr.satya'_writings