" నాన్న !"
" నాన్న !"


" నాన్న...
చిరిగిన చొక్కా,
అరిగిన చెప్పు,
తడిచిన ఒళ్ళు,
నలిగిన మనసు —
బహుశా ఇదేనేమో నాన్నకి సరైన నిర్వచనం !
ఆధునిక ఆలోచనల దినదినాభివృద్ధిలో పడి,
అతని లోతైన ఆలోచనలను అందుకోవడంలో ఆగిపోయామా...?
అతను వెనుకపడిపోయాడనే భావనలో
మనమే తడబడిపోయామా...?
అతని మనసు చదవగల మనసులు
మనుషులమైన మనకి లేకపోయామా...?
గడియారాన్ని గౌరవించే క్రమంలో,
అతని సమయాన్ని గుర్తించలేకపోయామా...?
ఎవరో గొప్పవాళ్ల గురించి చదువుతున్నప్పుడు,
మనల్ని గొప్పగా ముందుకు నడిపి, మన ముందే నిలిచిన
ఓ గొప్ప వ్యక్తిని విస్మరించేసుకున్నామా...?"