వెయిట్ - భారం (prompt 25)
వెయిట్ - భారం (prompt 25)
ఎంతో కష్టమైనది వెయిట్ లిఫ్టింగ్ చేయడం
మరెంతో కష్టమైనది సంసార భారం మోయడం
వెయిట్ లిఫ్టింగ్ లో జరుగుతుంది గెలవడం
బాధ్యత తప్ప గెలుపు లేనిది సంసారం మోయడం.
ఆటల్లో ఛాంపియన్ అంటారు గెలిచిన వారిని
కష్టజీవి అంటారు సంసార రథం లాగే వారిని
ఛాంపియన్ సాధించేది బహుమతి ని, పేరుని
ఈ కష్టజీవికి దక్కే పేరు 'ఏం సాధించాడు' అని.