STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance

4  

Venkata Rama Seshu Nandagiri

Romance

పెండ్లి పిలుపు

పెండ్లి పిలుపు

1 min
235

నీ రాకకై వేచి ఉన్నాను నేను

ఎంతకూ కానరాక నీ జాడను

నా మది వ్యాకుల చెందెను

నిను చూడలేని దినమును

కలయందైన తలుప జాలను

నీవు కరి మబ్బుల మాటున

పున్నమి చంద్రుడవై దాగిన

మెదలదా ఈ చెలి నీ తలపున

చూడ రావేమి నన్నొక్క మారైన

నీకు కోపమెందులకో నా పైన

రేగెను నా ఎదలో అలజడి

విని నీ మెత్తని అడుగుల సడి

నా లయ తప్పిన గుండె సవ్వడి

ఆర్చుకు పోయె గొంతులోని తడి

తాపము వలన ఒడలంతా వేడి

కనులు ఒలికించు మౌన గీతం

కానీ నా పెదవి దాచని మౌనం

నీ వీనుల చేరిన శ్రావ్య రాగం

నా హృది లోని మధుర భావం

ఏమి చేయుదువో నీదే భారం

నీ పెదవుల మెరిసిన మెరుపు

నా బుగ్గల్లో తెచ్చె నిగారింపు

ఎదలో సుస్వరాల సవరింపు

మన కలయికకది కొత్త మలుపు

అందరికీ ఆనందాల పెండ్లి పిలుపు.


Rate this content
Log in

Similar telugu poem from Romance