STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Classics

4  

Venkata Rama Seshu Nandagiri

Classics

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

1 min
293

హర హర మహాదేవ శంభో శంకరా

గిరిజా శంకరా ఇందు శేఖరా

నీలకంఠరా దేవా గంగాధరా

ఈ దీనులను కావగ రావా శంకరా

ఇడుములను నీ స్మరణతో భరించి

నీవు తప్ప దిక్కు లేరని భావించి

నీకై వేచి చూసే దీనులను కాచి

కాపాడగ రావా భక్తవ శంకరా

భక్త సులభుడని బిరుదుగల‌ నీవే

భక్తుల ఆర్త నాదములను వినరావే

నీ దయకై వేచే దీనులను కావరావే

శరణన్న వారిని కరుణించు శంకరా

స్వామీ, నిన్ను భోళా శంకరుడు అంటారే

పిలిచిన పలికే స్వామివి నీవని అంటారే

మీ కరుణాకటాక్ష వీక్షణలు ప్రసరింప రా రే

మీ పాదముల చెంత నున్న నన్ను బ్రోవరే

కష్ట సుఖాలను నీ ఆజ్ఞగా స్వీకరించాము

అవే మాకు దక్కిన ప్రాప్తమని తలచాము

అన్నింటికీ ఓర్పుతో తలవంచినాము

ఇంక మోక్ష ప్రాప్తిని కలిగించు పరమేశ్వరా!

ఈశ్వరా, జగదీశ్వరా, పరమేశ్వరా

ఈ దీను రాలిపై దయ చూపగ రా రా


Rate this content
Log in

Similar telugu poem from Classics