STORYMIRROR

VENUGOPALA RAO PHARSHY

Classics

5  

VENUGOPALA RAO PHARSHY

Classics

హంసనావ(బాహుబలిచిత్రం స్ఫూర్తి)

హంసనావ(బాహుబలిచిత్రం స్ఫూర్తి)

1 min
35K

( అన్నీ కందపద్యాలు) 


లలనాలలామకోమల


లలాటతల మర్థచంద్ర లలితత తోపం


గులుకుౘు హొయలుగ డోలన 


వలయమ్ముల నంౘనావ వడివడిసాగెన్



లలిమీఱుౘు నెలఱేఁడు ధ


వళకాంతులు సలిలబిందుఫలకతలముపైఁ


జెలరేగి కురియ వెన్నెల


జిలుగులఁ దెరచాఁప పడవ చిడిముడి నడచెన్



సుకుమారమ్ములవి సమీ


రకుమారమ్ములు సుమీ! సరాగమ్ముగఁ దా


మొకమాఱ మారశరతతిఁ


గకావికలు చేసె మతులఁ

గాంతాప్రియులన్‌



మలయానిలములు వలపుల


యలరుల పరిమళమలఁదె మహాప్రకృతికళా


కలితమ్మవుౘును సకల


మ్మలరారె విలోలకలలతాంతలతికలన్‌



ఆలల యలౙడుల నడుమన


నలరించెను సఖుఁడు సఖిని నమితసుఖుండై


యలఁ గమలామలలోచనుఁ


బిలౘుౘు లీలావిలాస

విలసితకేళిన్



అలినీలాలకలూఁగఁగ


విలువిద్దెన సాటిలేని వీరుండగునా


చెలికాని చెంత చేరిన


చెలియకుఁ జెలువమ్ము చెలగెఁజింతలు తొలగెన్



అలవోకగఁ దెరచాఁపను 


మెలిద్రిప్పిన తడవఁ బడవ మృదులహరీసం


కలితమయి తూగుటూయల


వలె నీవల నావలకునుఁ బయంచె నదిన్‌


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics