ఏకాధిపతి ఏకాధిపత్యం
ఏకాధిపతి ఏకాధిపత్యం
హెచ్చు పొందుతోంది ఆతతాయిల అసుర శక్తి,
ప్రతారణ పీడ చూసేను ప్రతి నిస్సహాయ వ్యక్తి,
అసహ్యం ఇక ఏకాధిపతి చేసే వ్యర్థమైన యుక్తి,
అతి శీఘ్రంగా కావాలి అపరాధుల నుండి ముక్తి |౧|
నశిస్తోంది స్వదేశ ప్రభుత్వం పౌరులలో సదాచారం,
భ్రష్ట అనుచరులు వ్యాపించెను కేవలం అనాచారం,
సాధారణం అయిపొయింది సంఘంలో భ్రష్టాచారం,
తెలియదు ఎప్పడు అంతరించెను ఈ అత్యాచారం |౨|
ప్రోద్బలంతో దినదినం పెరిగెను ధ్వంసకారి హుంకారం,
వినాశ తాండవం సృష్టించెను ఈ అనవసర అహంకారం,
మదాంధుడై చేసెను సత్యం నీతి న్యాయం పైన ప్రహారం,
సందేహాస్పదం అసాధ్యమయెను ఏకాధిపతి ఉపసంహారం |3|
ఏకాధిపతి ఏకాధిపత్యం చేసెను విధి విధానాలను నృశంసంగా వధం,
శిలాశాసన ఆదేశాలపై తర్కాలు ప్రశ్నలు విమర్శలకు వచ్చెను క్రోధం,
నియంత్రిత వార్తా ప్రసారసాధనం అయ్యెను పక్షపాతంగల ఆయుధం,
నిరోధం నిషేధంలో ఉన్న న్యాయవ్యవస్థకి నిజంతో ఉండదు సంబంధం |౪|
దుర్జనులు దుర్మార్గులు నష్టం చేసెను ప్రజాస్వామిక మూల్యబోధనం,
లోకకల్యాణ కార్యకలాపాల నిర్వహణలో పై తెచ్చెను సంక్లిష్ట అవరోధం,
దుస్సాధ్యం అయ్యెను ఏకాధిపతి ఏకపక్ష నిర్ణయాల విరోధం ప్రతిరోధం,
సమాధానం పరిష్కారం కొరకు జగపతి వెంకన్నకి చేస్తున్నాం అనురోధం |౫|