STORYMIRROR

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

విభూషిత పరిచయం

విభూషిత పరిచయం

1 min
249


ప్రభాకర పూర్ణచంద్ర ప్రదీపానికి ఆభరణము అయ్యెను ప్రదీప్త కిరణం,

నిష్కపట స్మితహాసం అయ్యెను ప్రఫుల్ల వదనానికి వినూత్న విభూషణం,

స్పష్ట సద్గుణసంపన్న చింతన పధ్ధతి మేధానికి అయ్యెను అలంకరణం,

వాగ్వేగముగల విశిష్ట పారంగత కథోపకథనము ఆభాషణానికి అభూషణం |౧| 


విలక్షణ వక్త వ్యక్తులు ఎప్పుడు కథిత పరిస్థితిలో చేసెను సముచిత సహాయం,

అప్పుడు వారు సభ్య సమాజానికి నిరంతరంగా అయ్యెదరు అతి విశ్వసనీయం,

అటువంటివారి సమతా మమతా సద్భావన సదాచారము ఎంతో బహుమూల్యం,

వారి ప్రతి సచ్ఛీల సార్వజనీన ఉత్థాన ఉన్నతి ప్రయత్నం అత్యంత లోకమాన్యం |౨|

<

br>

ప్రత్యేక మనీషీ అంతరంగమునందు ఉండెను ఒక విశేష విభూషిత పరిచయం,

కుశాగ్రబుద్ధిగల మార్గదర్శులు చేస్తారు సర్వోత్తమ వచన వివేచనల వినిమయం, 

జనసమూహంలో అయ్యెను ఏకైక అభినవ ప్రభావశాలి నేతృత్వానికి నవోదయం,

తన మహత్తత్త్వ శాలీన మైన హృదయగ్రాహి వ్యక్తిత్వంతో సదా ఉండెను నమనీయం |3|


స్వామి వివేకానందుల ఆధ్యాత్మిక విద్యలో అంశదానం చిరస్మరణీయం,

అతని అపరిమిత జ్ఞానప్రభగల సమృద్ధ ప్రతిభ సతతం అవిస్మరణీయం,

ఇహలోకానికి అప్పగించిన భక్తియోగ వేదాంత ఉపన్యాసము అద్వితీయం,

అతను నిస్స్వార్థంగా బోధించిన ప్రత్యేక అభిప్రాయం యేవేళ మాననీయం |౪|


Rate this content
Log in

Similar telugu poem from Abstract