విశ్వజనీన విశ్వంభరులు
విశ్వజనీన విశ్వంభరులు


మీరు మా నీలాంబరులు,
మీరు మా పీతాంబరులు,
మీరు అనంత అంబరులు,
మీరు విశ్వజనీన విశ్వంభరులు,
మీరు వరాలు ప్రసాదించే వరదులు |౧|
మీరు ఎంతో మహనీయులు,
మీరు ఎంతో వందనీయులు,
మీరు ప్రాతః స్మరణీయులు,
మీరు సతతం మోహనీయులు,
మీరు అత్యంత ఆదరణీయులు |౨|
మీరు మా దీనబాంధవులు,
మీరు భాగవతంలో విభవులు,
అపారం మీ విశిష్టమైన వైభవం,
సహజసిద్ధంగా ఉండెను మీ స్వభావం,
అర్థం అయ్యెను మీకు ప్రతి మనోభావం |౩|
మీరు తులసీక్షేత్రానికి అధిపతులు,
మీరు నీలాచలక్షేత్రానికి అధిపతులు,
మీరు తిరుమలక్షేత్రానికి అధిపతులు,
మీరు సింహాచలక్షేత్రానికి అధిపతులు,
మీ ఆశీర్వచనాలతో ఆలోచనలకు వచ్చెను సద్గతులు |౪|