Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

3  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

సమయ చక్రం

సమయ చక్రం

1 min
170


సమయం ప్రతిదినం సృజించెను కొత్త కథ,

నిమిష నిమిషానికి మార్చెను సర్వసామాన్య గాథ |౧|


కాలం నేడు ఇచ్చెను అభినవ అనుభవం,

మరుసటి రోజు ఇచ్చెను ఒక స్మరణీయ విభవం |౨|


జలపాతం వలె జాలువారెను క్షణ క్షణం,

కాలం నిత్యనూతన జలధారగా ప్రవహించెను ప్రతిక్షణం |౩|


సమయచక్రానికి ఉన్నది ఓ నిర్ణీత సారణి,

అనుక్షణం లేదు ఒక స్థిరమైన స్థానంగాని ఒక నిర్దిష్ట శ్రేణి |౪|


ఈ సీమిత కాలంలో శ్రవణం చెయ్యాలి శ్రీజగన్నాథుని అమృతవాణి,

ఎందుకంటే ముహూర్తం ముహూర్తం స్వయంగా అరుదైన మరకత మణి |౫|


సమయానికి ఎవరితోనూ లేదు బాంధవ్యం,

అందరికి నిష్పాక్షికంగా అవకాశాలు ఇవట్టమే సమయానికి ఉన్న కర్తవ్యం |౬|


విద్వాంసులు చేస్తారు సమయానికి సర్వశ్రేష్ఠ సదుపయోగం,

నియమిత జ్ఞాన ఉపార్జన కొరకు చేస్తారు సమయానికి సద్వినియోగం | ౭|


ప్రతి ఒక్కరికి ఉండాలి జీవితకాలంలో ఆశ ఆశయం,

లక్ష్య సాధన కొరకు చెయ్యాలి సమయాన్ని వ్యయం |౮|


సమయ చక్రం ప్రత్యేక వేళకి అయ్యెను ప్రత్యక్షదర్శి,

కాలచక్రం యేవేళ వాస్తవిక పరిస్థితుల పరిష్కారానికి అయ్యెను మార్గదర్శి |౯|


సమయం సతతంగా ఉండెను సమదర్శి,

ఉత్కృష్టమైన సంస్కారకునిగా అనవరతం ఉండెను త్రికాలదర్శి |౧౦|


అమూల్యమైన సమయ-చక్రానికి ఎల్లకాలం ఉన్నది బలమైన స్థానం,

వేళతప్పని వ్యక్తిత్వం ఉన్న అధిపతులకు బహుకరించెను మానం సమ్మానం |౧౧|


Rate this content
Log in