Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

మా అమ్మ

మా అమ్మ

1 min
390


మా అమ్మ !

మా అమ్మల గన్న అమ్మ !

మా అపరూపమైన స్నేహశీలి అమ్మ !


మృణ్మయ రూపం మీది చిన్మయం,

మీ ధ్యానంతో మనసు అయ్యెను తన్మయం !


మీరు అత్యంత దయామయి,

మీ కృపాదృష్టి సతతం జ్యోతిర్మయి,

మీరు మృదుహాసం భరిత మమతామయి,

మీరు స్వయంగా దుర్గతిని నశింపచేసే శక్తిమయి,

మీరు మా జీవితాలలో చిరకాలంగా ఆనందమయి,

మీ అమృతవచనలు ఆశీర్వచనల్తో అయ్యారు సుధామయి !!


మా అమ్మ !

మా అమ్మల గన్న అమ్మ !

మా అపరూపమైన స్నేహశీలి అమ్మ !


మీరు ఎల్లప్పుడూ మాకు పూజనీయం,

మీరు ఎల్లప్పుడూ గౌరవనీయం వందనీయం !


మీకా మా నతమస్తక ప్రణామం,

స్వీకరించండి మా భూమిష్ట ప్రణిపాతం !


మా అమ్మ !

మా అమ్మల గన్న అమ్మ !

మా అపరూపమైన స్నేహశీలి అమ్మ !

మమ్మల్ని మీ మమత చ్ఛాయతో దీవించండి అమ్మ !!


Rate this content
Log in

Similar telugu poem from Abstract