అయ్యో పాపం!
అయ్యో పాపం!


చినుకులు
చిరుగాలినడిగాయి
ఎందుకింత
విషపూరితమైనావని
చెట్టు
నీడనడిగింది
నీ ధరికి
ఎవరూ
రావట్లేదెందుకని
వరద
వాననడిగింది
నీలో
ఎవరూ
తడవట్లేదెందుకని
మనిషి మనిషిగా
ఎప్పుడవుతాడని
పడిగాపులు కాస్తున్నాయేమో పాపం!
మనిషికంటిన
మాలిన్యం గూర్చి
వాటికి తెలీదేమో!