కాలమునకు తగ్గ కార్యచరణ
కాలమునకు తగ్గ కార్యచరణ
పద్యం:
అద్రి పొడుపు రంగు అరుణ వర్ణమునుండు
పొద్దు పెరుగు కొలది పొగరు మారు
కాలమునకు తగ్గ కార్యచరణ చేయి
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
భావం:
తల్లీ భారతీ! సూర్యుడు ఉదయించే సమయంలో ఎరుపు రంగులో ఉంటాడు. అదే సమయం అవుతున్న కొద్దీ తన రంగును మార్చుకుంటాడు అంటే మనం కూడా సమయాన్ని బట్టి మన పనులు చేయాలి.