కథానాయకి !
కథానాయకి !
ఆ పుస్తకంలో వర్ణించబడిన నాయకి
పాఠకులకు పరిచయమయ్యే వేళకి
ఒక యుక్తవయస్కురాలు .
ఆమె ప్రవేశంతో అందరిలో
పేజీలు వేగంగా కదలాలనే ఉత్కంఠ .
బాలలకు తమతో ఆడిపాడే
మరో సోదరి ఆ పాత్రలో కనిపిస్తోంటే,
యువకుల్లో అపూర్వమైన అందచందాలను
చూసి ముగ్ధులవ్వాలని , ఊహాప్రపంచంలో
కాసేపు మైమరచి విహరించాలని .
వృద్ధులకేమో వారి యవ్వన విశేషాలను
జ్ఞప్తికి తెస్తూ , ముఖాల్లో ఆనందం తాండవిస్తూ !
వేచియున్న కథానాయకుడు
పరిమళభరిత , రంగురంగుల పూదోటలో
ప్రకృతి సౌందర్యారాధనలో .
అంతలో , నెమలిలా నడచి వచ్చిన చెలియ
ప్రేమను కురిపించే చల్లని చూపులతో .
ఇరువురూ వెచ్చని హృదయాంతర ఊసులు
పెల్లుబికే సన్నివేశంలో ...
సూర్యుడు ఎప్పటిలా సంధ్యాసమయంలో
ప్రేమజంటలకు
నీలిమబ్బుల నీడలో
ఆహ్లాదాన్ని కలిగించే తారల వెలుగులోకి
జాబిలి రాకను స్వాగతిస్తూ ..!

