నిన్ను చూస్తుంటే ..!
నిన్ను చూస్తుంటే ..!


నిన్ను చూడగానే
నా తలపుల్లో ముద్దబంతుల ఆట .
కౌగిట్లో ముద్దులిచ్చే
మురిపాల వలపుపిలుపుల పాట .
ఆ కనులు
అరవిచ్చిన వెన్నెలింటి కలువలు .
ఆధరాలు
ఉసిగొలుపు చిలిపి మందారాలు .
కురులు
జాబిలిని ముసిరే అసురసంధ్య చీకట్లు .
విరులు
సుగంధాలను వెదజల్లుతున్నట్లు .
నీ ఇరుబుగ్గల్లో
నున్నని గులాబిపూల కొమ్మలు .
మొత్తంగా సిగ్గుల్లో
పల్లకీ ఎక్కి విహరించు గుమ్మలు .
ఎల్లవేళలా నీవొక
ఆకర్షణీయమైన చామంతి పూవువు .
నీ గాలి సోకగానే
నేనౌతాను ప్రొద్దుతిరుగుడు పువ్వును !