అందుకో నా ప్రేమకానుక !
అందుకో నా ప్రేమకానుక !


ప్రేమ నీవు నాకందించిన బహుమతో ,
ఏర్పడిన బంధంలోని మకరందమో నీతో !
అది కలిగించిన గొప్ప అనుభవం ,
పెంచిన అనంతమైన ఆనందం
నేలపై అలముకున్న హరితవర్ణం ,
నీలాకాశానికి వన్నెతెచ్చే ఆ లేత ఎరుపువర్ణం .
పువ్వులా విరబూసే నీ తీర్చిదిద్దిన అందం
నన్ను రోజంతా మంత్రముగ్థుడను చేస్తే ,
అనురాగం ఉల్లాసంగా నడిపించే ఇంధనం .
సలహాలు నూతన ప్రపంచాన్న
ి ఆవిష్కరిస్తే ,
ఉత్సాహం నన్ను నన్నుగా చూపే వందనం .
నదిలోని నీటి అలల గలగలల ప్రవాహంలా
ఒకరివల్ల మరొకరిలో కలిగే ఆ ప్రేరణ
జీవితంలో కలసివేసే ప్రతి అడుగులో నిజం .
ప్రేమకు ప్రేమే సమాధానమైనా
పండుగల పరికల్పనలో కానుకల సమర్పణ
మన సంస్కృతిని తెలిపే ధ్వజం .
అందుకో అందుకే ...
నా సంతృప్తికోసం ఓ మధుర చుంబనం 😉 !