STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

నిన్ను నన్ను కలిపేసిన కాలం

నిన్ను నన్ను కలిపేసిన కాలం

1 min
447

వేసవి కాలం వచ్చేసింది.......

నా ఈడు వేడికి తోడు వేసవి వేడిని తెచ్చింది

నా ఒంట్లో వేడి తీయ్యగా ఎదో కావాలంటుంది

నీ తపనల తలపులతో కోరికలు జ్వలిస్తున్నాయి

నా ప్రాయం రేపే సెగలతో 

తనువు స్వేదపు చుక్కలు 

నీ కౌగిలి లోగిలిలో మెరిసే ముత్యంలా మారాలనుకుంటున్నాయి 


ఈ వేసవి వసంత సమీరానికి 

విరిసిన పువ్వుల నవ్వులు

నీ కోసం వేచి చూసే ఓపిక అవిరవ్వకముందే

మన ప్రణయ సరసపు చిలిపి చేష్టలకు

స్వాగత పలుకుతున్నాను..... రా ప్రియా!


వానకాలం వచ్చేసింది......

వయసు కోరికల ముసురులో మురిసిపోతుంది

మురిసిన మనసు మొలకేత్తి చిగురించింది

చిగురించిన ఆశలు కోరలు చాపి 

నీ కౌగిలిలో తీయ్యని కాటు వేస్తానంటున్నవి

నా దేహం తాపంతో తపించిపోతు 

నీ స్పర్శలో తడిసిపోవాలంటుంది


ఈ వర్ష ఋతువు ప్రవాహనికి

నా వయసు వలపు జోరుకి

నా తనువు చిగురించిన అందాలను

అందుకొని ఆస్వాదించుకుందామని

ఆహ్వానం పలుకుతున్న..... రా ప్రియా!!


శీతాకాలం విచ్చేసింది ...........

సిగ్గుతో ప్రాయం ముడుచుకుపోయింది

ఘనీభవించిన నరాలు 

యమ పాశంలా తరుముతుంటే

నా పరువాలు .........

నులివెచ్చని సెగ కావాలంటున్నవి

నా దేహం ........

నీ దేహ కౌగిలిలో చలిమంటను కాచుకోమ్మంటున్నది


ఈ శీతాకాలం హేమంతఋతువుకి

గడ్డకట్టిన మంచు కరుగక ముందే

చలి కాలపు గ్రీష్మానికి చెట్ల ఆకులు రాలక ముందే

మన కోరికల కుంపటిని రాజేసుకుందాం..... 

రా ప్రియా!!!



Rate this content
Log in

Similar telugu poem from Romance