నైట్ షిఫ్టు
నైట్ షిఫ్టు
ఇదిగో ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు
ఇంకా రాలేదు
అర్థరాత్రి కావస్తోంది
ఎంతో కాలం నుంచి వేచిన ఆమె యవ్వన భారం
యద సంపదకు చేరింది
దంత క్షతాలని అనుభవించాలని కాబోలు
అతడు తాకాలని ఆమె తనువు తహతహలాడింది
యుగముల భారపు నిట్టూర్పు శ్వాస భారంగా తోచింది
ఒంటరిగా మొదటి రాత్రి కునికిపాట్లతో అతని కోసం
ఎదురు చూపులతో గడిచిపోయింది
విసిగిపోయి నిదురిస్తున్న ఆమె అతడి ముద్దును గ్రహించింది
వేకువ కిరణంలా అతడు ఆమెను చేరి
గిలిగింతలు పెట్టాడు
ఆమె మకరందపు అందాల్ని తనివి తీరా ఆస్వాదించాడు
తన కౌగిలికి ఆమెను రాణిని చేశాడు