వింత విలాపం
వింత విలాపం
ప౹౹
కూర్చుండనీయదు కూరిమినే కూర్చుండనీయదు
నిల్చుండనీయదు నీలో వలపు నిల్చుండనీయదు ౹2౹
చ౹౹
వింతైన మనసుకే వివరం తెలీక ఏమి విడ్డూరమో
కొంతైన చింతైన తీరక మదిలోన చెడ్డ యవారమో ౹2౹
కనికట్టు కట్టినట్లు కలలోను వదలదే కనిపెట్టుకొని
కను కొట్టి పిలిచినట్లే ఇంక కదలదే అంటీపెట్టుకొని ౹ప౹
చ౹౹
ప్రేమించే వాడికి ప్రేయసి కౌగిలే పెద్ద పెన్నిది కూడా
రాయంచే రావించికనే రప్పించును లేకుండ తేడా ౹2౹
తీరం చేరాలని తీరికలేని ఆరాటమే ఆ అలలకూ
భారం తీర్చాలని ఉరికే పోరాటమే ప్రేమ కలలకూ ౹ప౹
చ౹౹
నిదురే రానీదుగా నిండు జాబిలీ నీడలా తోడుగా
చెదిరే పోనీదుగా పండు పరువం పక్కనే జోడుగా ౹2౹
ఉండిపోవాలని జంటగా ఊహించే ఎద సాంతమే
కల్సుండిపోవాలని కథ వినిపించే వచ్చివసంతమే ౹ప౹
చ౹౹
ఎన్ని పున్నమిలో ఎదురై పెంచ లేదా ఎద బెడదనే
అన్ని తన్మయాలు అలయిక చేరుకున్నాక ఎడదనే ౹2౹
నీలో నీవే రగలక నిలువెత్తు ప్రేమని నిగ్రహించలేవా
తలోచేయి కలపితేనే ప్రేమ పండునని గ్రహించలేవా ౹ప౹