Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

ఎడారి ఎడద

ఎడారి ఎడద

1 min
39


ప౹౹

ఎడారిలోను ఎడద కోరిక ఎన్నడు తొలగిపోదులే

మోడారిని మొగ్గలా ప్రేమదీపము మలిగిపోదులే ౹2౹


చ౹౹

అరవిరిసిన మందారం ఆశలపందిరి అలంకారం

తెగ మురిసిన తెరువరికి తెలుపరాదా శృంగారం ౹2౹

దోసిళ్ళతో దోరగాసిన వలపునూ దొరకబుచ్చవా

కసి కళ్ళతో దాచేసిన ఆ కాంక్షలనే నిద్రబుచ్చవా ౹ప౹


చ౹౹

లోతైన ప్రేమకు లోగిలియే ఈ హృదయమేనులే 

నీతోనే కలిసిన నిండు తెల్లారిన ఉదయమైనులే ౹2౹

నీటైన ప్రేమనూ నిందలు ఏమిచేయలేవులే మరి

మాటైన ఒకటి మనసులోను నింపేయరాదా కోరి ౹ప౹


చ౹౹

వలపనేది వరద గోదారేలే వయసులో ఉన్నపుడే 

అలపనేదిలేక ఆస్వాదించై సమయమొచ్చినపుడే ౹2౹

సోయుగమన్నది సాయముగనుంది ఇక జంకనేల

ఈజగమన్నది నడిచేది ప్రేమతోనే కానిక వంకలేల ౹ప౹


చ౹౹

మధురభావనలే మదిలో మారాములే మొదలిడ 

అధరపు ఆరాధనలే అవసరాలే పెంచేసి కదలిడి ౹2౹

జాగేలా జవరాలకి ప్రణయాలే పదిలంగా పంచనే

బాగేలే భావలాలిత్యం బహురూపమై అదిలించనే ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance