Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

లేత యవ్వనం

లేత యవ్వనం

1 min
146


ప౹౹

కలకాలం కళ్ళతోనే కురిపించాలి ఆ లేత ప్రేమలు

ఎల్లకాలం ఎదలోనే దాచి చూపాలి దాని అమలు ౹2౹


చ౹౹

లేత యవ్వనం లేస్తూనే ప్రేమనే కావాలని కోరింది 

కొత్త యవ్వారం వింతకోరికనే మదిలోనికి చేరింది ౹2౹

మనసులో మారాకులూ తొడిగే సమయమే మరి

వయసుకు ఏదో అనుభూతి అడగక చిత్రమై చేరి ౹ప౹


చ౹౹

కనువిందు చేయని కలబోసిన అందాలే కనులకు 

మునుముందు ప్రణయాల ముచ్చటైన పనులకు ౹2౹ 

వలపుల లోకానికి దేవుడిచ్చిన ధీటైనా వరాలవి

మరపుల మదిలో మరువలేని వింత సమరాలవి ౹ప౹


చ౹౹

ఎలమితోనే చేరకపోతే అందమేలేదు జీవితానికి 

చెలిమితోనే చేరలేకపోతే అర్థమేలేదూ హితానికి ౹2౹

రొండు మనసులు రొదతో చేసేనూ అదే నినాదం

ఉండబట్టలేని ఊసులు వంతపాడే వలపునాదం ౹ప౹


చ౹౹

కొదువలేనీ కోరికలు కొలువుతీరును ఆ మదిలో 

మదుపేలేని మరుల తూణీరాలే ప్రేమల పొదిలో ౹2౹

లేలేత హృదయాలు లేచివేచే కనుసైగ కదలికకే

స్వాగత చిహ్నాలూ చిగురించే చివరకూ వదలకే ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance