శ్రావణ మేఘం
శ్రావణ మేఘం


ప౹౹
వాన జల్లే వచ్చెనమ్మా వందనమూ చేసుకో
వలపు ముల్లే గుచ్చెనమ్మా బందం పెంచుకో ౹2౹
చ౹౹
పచ్చని ఆకులు పలికినే చిటపటలే చిన్నగా
విచ్చని పువ్వులు కూడ వికసించినే సన్నగా ౹2౹
లేత హృదయాలు లెఖ్డ మరిచెనే సరికొత్తగ
లేమ నయనాలు చిక్కే విప్పినే మరివింతగ ౹ప౹
చ౹౹
శ్రావణ మేఘాలు శ్రమించినే ధారాపాతమై
శ్రమణ భావాలు ఊరించెనే ఊహజనితమై ౹2౹
కలబోసిన అందాలు కార్చిచ్చులే రేపేసెనూ
తలపోసిన ఊహలు తనువునే కాల్చేసెనూ ౹ప౹
చ౹౹
నర్తించే మయూరం పురివిప్పినే పులకించి
వర్తించే సమీరం దిశలు మార్చినే ఆలకించి ౹2౹
వలపులోన వసంతమే వరించి వచ్చేయగా
అలపులేని ఆశలు పండించవా నచ్చేయగా ౹ప౹