ఎవరికోసం
ఎవరికోసం


ప౹౹
ఎవరికోసం ఎదురు చూసావు ఎదలో తలచి
ఎందుకోసం వేచావు ఏమరక మదిలో వలచి ౹2౹
చ౹౹
లయించిన మనసులో మురిపించే లాలిత్యం
రచించిన కావ్యంలోన ఆ మరపించే కవిత్వం ౹2౹
ఏమంటున్నాయి ఎరిగిన ఊహలే ఆశలతోనే
ఎలాంటున్నాయి మారని ఆశలే ఊహలతోనే ౹ప
చ౹౹
సూదంటు రాయిలా కోరికలే కొరికేస్తున్నాయి
క్రీగంట చూపులు చుట్టంతా వెదికేస్తున్నాయి ౹2౹
ఎదలోని ఎలమి ఊసులు పలకరిస్తున్నాయి
పదంలేని ప్రేమ భాషతోనే పులకరిస్తున్నాయి ౹ప౹
చ౹౹
ఎదురుచూపుల మధురభావన మరువకమా
చెదరని ఆశలే చేరువవు వరకూ చెరపకుమా ౹2౹
చిన్ని మనసుకే చిద్విలాసం పూర్తిగ చేకూరనీ
అన్ని వసతులు కూడి హాయిలు సమకూరనీ ౹ప౹