STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4.9  

Ramesh Babu Kommineni

Romance

వానజల్లు

వానజల్లు

1 min
89


ప౹౹

వాన జల్లే కురిసెనమ్మా వరదలా వరవడితో

వలపుముల్లే గుచ్చెనమ్మా మది ఉరవడితో ౹2౹


ప౹౹

ఝంకారాలే తనువునెల్ల తరుమనే సాగేలే 

ఘీంకారాలే ఎదలోన ఎక్కడో కానక ఊగేలే ౹2౹

మాయ ఏదోమత్తులా ఆనక కమ్మివేసేనులే

ఛాయ కూడా చొరవే చూపే నమ్మి ఆశనులే ౹ప౹


చ౹౹

దిగంతాలు దిగివచ్చి దీవించి అనుగ్రహించ 

అభ్యంతరాలులేని ప్రేమనూ నీవూ గ్రహించ ౹2౹

సన్ననిచినుకులు సామూహికంగా ఊరించ

నున్నని అధరాలు నుగ్గాయె తోడు సారించ ౹ప౹


చ౹౹

నచ్చినా వాతావరణం వరసలే కుదిర్చెనులే

మెచ్చిన కారణం మెసలకంత అమర్చెనులే ౹2౹

వానజల్లే పన్నీటిజల్లై మురిపించే పరవశాన

హరివిల్లే ఆమోదించే హర్షంచూసి ఆకాశాన ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance