తనువు-తన్మయం
తనువు-తన్మయం


ప౹౹
చిగురించనీ చిత్రమైన ప్రేమని చిరకాలం
వ్యక్తికరించనీ వలపును వేసీ చిరుగాలం ౹2౹
చ౹౹
వింతైన వ్యామోహం మదిని మత్తెక్కించే
కొంతైన సడలింపేలేక మనసునే కిక్కెంచే ౹2౹
చెలి కోసం చెలిమికోసం ఈ ఎద చెదిరినే
గేలిచేసి గెలవాలని గోలచేసే తీరే కుదిరినే ౹ప౹
చ౹౹
మందారం విరిసెనన కారణాలెన్నో వెనుక
పందేరంలా పంచవచ్చు ప్రేమున్నది కనుక ౹2౹
సిద్దమేనా చిరు మందహాసం ఒడిసిపట్టను
హద్దులను చెరిపేసి హత్తుకొని గట్టేదాటను ౹ప౹
చ౹౹
వలపన్నది వరదేను మనసు కట్ట కోయను
తలపన్నది తరగనిదేను తరలి విచ్చేయను ౹2౹
సాధించిచూడాలి సావకాశంతో ఆ అంచునే
మధించి మదిలోను మరులన్నీ కురిపించనే ౹ప౹
చ౹౹
ప్రేమేన్నది శాశ్వతమేగ వెలుగున్నంత వరకు
ఇమ్మన్నది మనసేగ మొక్కేసి ఆంక్షల తెరకు ౹2౹
అపుడేగా చిగురించేది చిరకాలపు చిన్మయం
ఇపుడేలే తెలీసేది పొంగేటి తనువు తన్మయం ౹ప౹